బాలయ్య చెప్పిందే జరిగింది.. మాట వింటే బాగుండని బాధపడ్డ ఎన్టీఆర్..

తెలుగు సినిమా పరిశ్రమను తన అద్భుత నటనతో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన నటించిన పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు జనాలను ఎంతగానో అలరించాయి. ఆయన అద్భుత సినిమాలతో తెలుగు వారి ఆరాధ్య నటుడిగా మారిపోయాడు. అనంతరం ఆయన నట వారసుడిగా బాలయ్య సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. వీరిద్దరి మధ్య అనుబంధం చాలా గొప్పగా ఉండేది. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అందులో పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరు కలిసి మొత్తం 12 సినిమాలు చేశారు. అందులో 7 సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ అంటే బాలయ్యకు ఎంతో గౌరవం. ఆయన సెట్ లో ఏం చెబితే బాలయ్య అదే చేసేవాడు.

ఒకానొక సమయంలో ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాకు బాలయ్య దర్శకత్వం వహించాడు. కొన్ని కారణాల మూలంగా ఆ సినిమా దర్శకత్వం బాధ్యతల నుంచి బాలయ్య తప్పుకున్నాడు. ఆ సినిమా పేరు సామ్రాట్ అశోక్. ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మేజర్ చంద్రకాంత్ తర్వాత ఈ సినిమా వచ్చింది. మేజర్ చంద్రకాంత్ తెలుగు సినిమా పరిశ్రమలో కనీ వినీ ఎరుగని విజయాన్ని అందుకుంది. 1994లో ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్ కు ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది అంటారు అప్పటి రాజకీయనాయకులు. ఆ సినిమా తర్వాత చేసిన ప్రాజెక్టే సామ్రాట్ అశోక్.

సామ్రాట్ అశోక్‌ చిత్రంలో హీరోయిన్ గా వాణీ విశ్వ‌నాథ్ చేశారు. ఈ సినిమాకు ముందుగా ఎన్టీఆర్ దర్శకత్వం వహించాలి అనుకున్నాడు. అయితే తక్కువ సమయంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని బాలయ్యకు చెప్పాడు. అంతేకాకుండా దర్శకత్వ బాధ్యతలకు కూడా అప్పగించాడు. అయితే.. అంత స్పీడ్ గా సినిమా చేస్తే అంద ఫర్ఫెక్ట్ గా సినిమా రాదని బాలయ్య ఎన్టీఆర్ కు చెప్పాడు. అయితే ఈ సినిమాకు మళ్లీ ఎన్టీఆరే దర్శకత్వం వహించాడు. బాలయ్య చెప్పినట్లుగానే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అప్పుడు బాలయ్య మాటలను ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నాడట. బాలయ్య మాట వింటే బాగుండేది అనుకున్నాడట.