బాలయ్య జోరుకు సోషల్ మీడియా బేజారు!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ కోసం యావత్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు. ఇక ఈ సినిమా టీజర్‌ను సినిమా ప్రారంభంలోనే రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్.

కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా చిత్ర యూనిట్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ను కూడా చిత్ర యూనిట్ త్వరలోనే చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి అఖండ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తొలుత రిలీజ్ చేస్తారా లేక ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ముందుగా ప్రకటిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా అఖండ వరుస ట్రీట్‌లతో ప్రేక్షకుల్లో అదిరిపోయే ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.