అయ్యగారి కోసం మరో తమిళ కుట్టి?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ పూర్తి యూత్‌ఫుల్ చిత్రంగా తెరకెక్కించడంతో ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక కెరీర్‌లో ఎప్పటినుండో మంచి విజయం కోసం వెయిట్ చేస్తున్న అఖిల్‌కు ఈ సినిమా అదిరిపోయే కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో నటిస్తున్నాడు అఖిల్. ఏజెంట్ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తాడు. అయితే ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, చిత్ర యూనిట్ సాక్షి వైద్య పేరును అనౌన్స్ చేశారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో మరో తమిళ బ్యూటీని ఈ సినిమాలో తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమిళ యంగ్ బ్యూటీ అతుల్యా రవిని ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా సురేందర్ రెడ్డి అండ్ టీమ్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా నేచురల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అఖిల్ పక్కన ఇద్దరు ఫ్రెష్ మొహాలు కనిపిస్తుండటంతో ఈ సినిమాకు అది బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి ఏజెంట్ చిత్రంలో ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంతమేర పర్ఫార్మెన్స్ ఇస్తారో తెలియాలంటే ఏజెంట్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest