సల్మాన్ బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో..!

టాలీవుడ్ హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జపం చేస్తున్నారు. అందరూ వరుసబెట్టి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సౌత్ లో ఎలాగూ అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఇక్కడ ఆ సినిమాకు ఎక్కువగా ప్రమోషన్లు చేయాల్సిన అవసరం లేదు. పుష్ప డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుండగా.. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పలు తెలుగు సినిమాలు యూట్యూబ్ లో హిందీలో డబ్ అయి మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో పుష్ప సినిమాకు ప్రమోషన్లు నిర్వహించేందుకోసం స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగుతున్నాడు. హిందీ బిగ్ బాస్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప ప్రమోషన్ కోసం హిందీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా పుష్ప సినిమాకు బాలీవుడ్ లో కూడా ప్రమోషన్ లభిస్తుందని బన్నీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest