యూట్యూబ్‌ను ఊపిరాడకుండా చేస్తున్న అఖండ!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అఖండ ట్రైలర్ అదిరిపోయే లెవెల్‌లో ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు బోయపాటి పదునైన డైలాగులు యాడ్ అవ్వడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అనే ఆసక్తి సైతం ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమా ట్రైలర్ బీభత్సంగా ఉండటంతో ఈ ట్రైలర్‌కు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.

ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటి వరకు ఏకంగా 10 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ను సంపాదించడమే కాకుండా 300K లైక్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం. కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో మనల్ని ఎంటర్‌టైన్ చేయనున్నాడు. అఘోరా పాత్రలో బాలయ్య పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌ను ఇంకెంతలా షేక్ చేస్తుందా అనేది చూడాలి.