ఆ హీరో కి సపోర్ట్ చేసిన మెగాస్టార్..!

యువ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమాని వి.వి.వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు ఇక ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ఈ రోజున చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు హీరో కార్తికేయ.ఈ సినిమాకి బెస్ట్ విషెస్ కూడా తెలియజేశాడు చిరంజీవి. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా తమ కష్టాన్ని నమ్ముకుని పరిశ్రమలో తమ ఉనికిని చాటుకునే నటులను తాను ఎప్పుడు మెచ్చుకుంటానని తెలియజేశాడు చిరంజీవి. ఇక యువ హీరో కార్తికేయ కూడా అలాంటి ప్రతిభ ఉన్నదని, ఆ హీరోపై నాకు సోదర ప్రేమ ఉందని, అందుచేతనే నాకు ఇష్టమైన హీరోలలో కార్తికేయ కూడా ఒకరని తెలియజేశాడు.

ఇక తాను నటిస్తున్న రాజా విక్రమార్క సినిమా ట్రైలర్ ని చూశాను, చాలా థ్రిల్లింగ్గా ఉన్నదని తెలియజేశాడు. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని తెలియజేశారు.

Share post:

Latest