మేడం వస్తారు.. ఆ వైపు వెళ్లకండి

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబసభ్యులదే హవా.. ఇది అందరికీ తెలిసిందే. నెహ్రూ నుంచి ఇది కొనసాగుతోంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా వస్తోంది ప్రాధాన్యతల తీరు. రాజకీయంగా సోనియా పెద్ద నిర్ణయాలేం తీసుకోవడం లేదు. పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు అంతే.. ముఖ్యమైన నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీ, ఈయన సోదరి ప్రియాంక గాంధీ తీసుకుంటున్నారు. పార్టీ నాయకులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ పార్టీ వ్యవహారాలపై ద్రుష్టి సారించారు. వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఎలాగైనా యూపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదు.. అన్నిచోట్లా మేమే పోటీచేస్తామని కచ్చితంగా చెప్పేశారు ప్రియాంక. యూపీలో అధికారం చేజిక్కించుకుంటే ఆ క్రెడిట్ మొత్తం ప్రియాంకకే వెళుతుంది.. ఆ తరువాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్.

ఇక విషయానికి వస్తే.. ప్రియాంకగాంధీ బుధవారం హైదరాబాదుకు వస్తున్నారు. అరె.. సడన్ గా ఆమె సిటీకి ఎందుకొస్తున్నారు అనుకోకండి.. ప్రైవేటు పనిమీద కుమారుడితో కలిసి వస్తున్నారు. ప్రియాంక కుమారుడికి కంటి సమస్య ఉండటంతో చికిత్స కోసం ఎల్ వీ ప్రసాద్ ఆస్పత్రికి వస్తున్నారు. రెండు రోజుల పాటు ఆమెనగరంలో బస చేస్తారు. అయితే ఈ రెండు రోజులపాటు ఆమె నగరంలో ఉంటున్నా.. స్థానిక కాంగ్రెస్ నాయకులు పొరపాటున కూడా ఆమెను కలవడానికి ప్రయత్నించవద్దని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పర్యటన ఓన్లీ పర్సనల్ ట్రిప్.. అంతే.. రాజకీయాలకు ఎటువంటి తావు లేదు.. అందుకే ఎవరూ కలవకండి అని పార్టీ శ్రేణులను హైకమాండ్ ఆదేశించింది. దీంతో టీ.కాంగ్రెస్ నాయకులు నిరాశలోఉండిపోయారు. మేడం సిటీకి వస్తే ఇక్కడి పరిణామాలు వివవించవచ్చన్న నాయకుల ఆశలు ఆవిరయ్యారు. ఏం చేస్తాం.. హై కమాండ్ ఆదేశం అంతే మరి..

Share post:

Latest