`బాహుబ‌లి`లో మంచు ల‌క్ష్మి రిజెక్ట్ చేసిన క్యారెక్ట‌ర్ ఏంటో తెలుసా?

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి త‌న సినీ కెరీర్‌లో తెరకెక్కించిన ఓ వండ‌ర్ మూవీ `బాహుబ‌లి` . తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని పెంచిన ఈ చిత్రం.. ప్ర‌భాస్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసింది. రెండు భాగాలుగా విడుద‌లైన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజ‌ర్‌లు ప్రేక్ష‌కుల‌కు గుర్తిండిపోయే పాత్ర‌ల‌ను పోషించ‌డ‌మే కాదు.. త‌మ‌దైన న‌ట‌న‌తో వారిని రంజింప‌చేశారు కూడా.

Prabhas starrer Bahubali series to re-release in theaters | Entertainment  News – India TV

ఇక ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పిన ఈ చిత్రాన్ని మొద‌ట రాజ‌మౌళి హిందీలో తీయాల‌ని భావించారు. కానీ, ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్న జ‌క్క‌న్న‌.. తెలుగులోనే తెర‌కెక్కించి టాలీవుడ్ స్టాయిని ఒక్క‌సారిగా పెంచేశారు. అయితే ఇటువంటి గొప్ప సినిమా నుంచి ఆఫ‌ర్లు వ‌స్తే.. కొంద‌రు స్టార్లు చేతులారా వ‌దులుకున్నారు. ఈ లిస్ట్‌లో మంచు ల‌క్ష్మి కూడా ఒక‌రు.

SS Rajamouli's Baahubali prequel on the anvil | Regional News | Zee News

ఇంత‌కీ `బాహుబ‌లి`లో మంచు ల‌క్ష్మి రిజెక్ట్ చేసిన క్యారెక్ట‌ర్ ఏంటో తెలుసా.. `శివ‌గామి`. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. బాహుబ‌లి చిత్రంతో అత్యంత కీల‌క‌మైన పాత్ర `శివ‌గామి`. మొద‌ట రాజ‌మౌళి ఆ పాత్ర‌ కోసం శ్రీదేవితో సంప్రదింపులు జరిపారు. కానీ శ్రీదేవి అధిక పారితోషికం కోరడంతో.. ఆ త‌ర్వాత అదే పాత్రకు మంచు లక్ష్మిని కూడా సంప్రదించార‌ట‌.

Manchu Lakshmi trolled for her tweet about Manchu Vishnu oath taking  ceremony for MAA

అయితే ప్రభాస్ కు తల్లి పాత్ర తాను కూడా చేయన‌ని మంచు లక్ష్మీ కరాఖండిగా చెప్పేసిందట. దాంతో చివ‌ర‌కు ఆ పాత్రను సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ పోషించి.. ప్ర‌పంచ స్థాయిలో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకుంది.

 

Share post:

Latest