బాల‌య్య అత్తింటివారి నుంచి ఎంత క‌ట్నం తీసుకున్నారో తెలుసా?

November 22, 2021 at 8:11 am

నటసార్వభౌమ ఎన్.టి.రామారావు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన న‌ట‌న‌తో స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న బాల‌య్య‌.. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ దూసుకుపోతున్నారు.

Nandamuri Vasundhara Devi - Bio, Age, Married, Nationality, Body  Measurement, Career

ఇక బాల‌య్య వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. 1982లో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినా దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయే వ‌సుంధ‌ర దేవి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన త‌ర్వాతే ఈమె బాల‌య్య‌ను వివాహం చేసుకుంది. ఎన్టీఆర్ గారి సహచరుడు, టీడీపీలో ముఖ్య పాత్ర పోషించిన మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్కర రావునే బాల‌య్య-వ‌సుంధ‌ర‌ల‌ వివాహం ద‌గ్గ‌రుండి జ‌రిపించారు.

Nandamuri Balakrishna Family Photos - YouTube

అప్ప‌ట్లోనే బాల‌య్య‌కు వ‌సుంధ‌ర దేవి కుటుంబం క‌ట్నంగా రూ.10ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌. ఆ క‌ట్నం డ‌బ్బుతో బాల‌య్య కోసం ఎన్టీఆర్ హైద‌రాబాద్‌లో ఇల్లు క‌ట్టించార‌ని నాదెండ్ల భాస‌ర్క‌ర రావు గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక బాల‌య్య‌-వ‌సుంధ‌ర దంప‌తుల‌కు బ్రాహ్మాణి, తేజస్విని, మోక్షజ్ఞ ముగ్గురు పిల్లలు.

Balakrishna Age Height Son Daughter Family Photos Biography Profile

బ్రహ్మీణిని చంద్రబాబు నాయుడు ఏకైక త‌న‌యుడు లోకేష్ కి ఇచ్చి వివాహం జ‌రిపించిన బాల‌య్య‌.. రెండో కూతురు తేజస్విని వైజాగ్ గీతం సమస్త కి చెందిన శ్రీ భరత్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అలాగే త‌న‌యుడి మోక్ష‌జ్ఞ‌ను హీరోగా సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేయాల‌ని బాల‌య్య ఎప్ప‌టి నుంచో ఏర్ప‌ట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

బాల‌య్య అత్తింటివారి నుంచి ఎంత క‌ట్నం తీసుకున్నారో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts