దుమ్మురేపుతున్న బాలయ్యబాబు ..’అఖండ’ ట్రైలర్ కేక..!

November 14, 2021 at 8:14 pm

బోయపాటి శీను దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం అఖండ.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రావడంతో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.. ఇకపోతే ఈ ట్రైలర్ లో బాలయ్య తన డైలాగులతో అందరినీ పిచ్చెక్కించేశాడు.. అలాగే తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ బాగా ఆకట్టుకున్నాడు… విధికి, విధాతకు, విశ్వానికి సవాలు విసిరకూడదు అంటూ స్టార్ట్ అయ్యే ఈ ట్రైలర్ లో బ్రేకులు లేని బుల్డోజర్ ను తొక్కి పారదొబ్బుతానంటూ బాలయ్య చెప్పే డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. హీరో శ్రీకాంత్ విలనిజం కూడా ఈ ట్రైలర్ లో చాలా చక్కగా చూడవచ్చు.

ఇకపోతే బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హాట్రిక్ మూవీగా అఖండ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ సరసన ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మిరియాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్రెడ్డి ఈ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.

దుమ్మురేపుతున్న బాలయ్యబాబు ..’అఖండ’ ట్రైలర్ కేక..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts