క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచిన టాలీవుడ్‌ హీరోయిన్లు వీళ్లే..!

November 22, 2021 at 1:44 pm

క్యాన్స‌ర్‌.. సినీ ఇండ‌స్ట్రీలో ఎంద‌రో తారలు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. అయితే క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని కృంగిపోలేదు. ధీటుగా ఎదుర్కొని దానిపై గెలిచి మ‌ళ్లీ తెర ముందుకు వ‌చ్చిన హీరోయిన్లు ఎంద‌రో ఉన్నారు. మ‌రి ఆల‌స్య‌మెందుకు ఆ హీరోయిన్లు ఎవ‌రో చూసేయండి.

Mamta Mohandas: If a woman gets into trouble, she is responsible for it -  Movies News

మమతా మోహన్ దాస్: తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టిగానే కాకుండా సింగ‌ర్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మ‌మ‌తా మోహ‌న్ దాస్‌.. 2010 లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. మొద‌ట భ‌య‌ప‌డినా ఆ త‌ర్వాత చికిత్స తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి కోలుకుంది. అయితే 2013 ఏప్రిల్‌లో ఆమెకు క్యాన్సర్ జబ్బు తిరగబెట్టింది. దాంతో తిరిగి వైద్యం చేయించుకుని క్యాన్సరు ముక్తురాలైన మ‌మ‌తా.. ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప‌లు చిత్రాల్లో నటిస్తోంది.

sheela kaur marriage: రెడ్డి గారిని పెళ్లాడిన అల్లు అర్జున్ హీరోయిన్ - allu  arjun parugu movie heroine sheela kaur gets married | Samayam Telugu

షీలా కౌర్: బాలనటిగా త‌మిళంలో దాదాపు 20 సినిమాల వరకు నటించిన షీలా.. బ‌న్నీ హీరోగా తెర‌కెక్కిన `ప‌రుగు` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన ఈ భామ‌..ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాడి గెలిచింది.

Rajinikanth-Kamal Haasan can't fill the void left by Jayalalithaa in TN  politics, says Gauthami - IBTimes India

గౌతమి: సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ గౌతమి.. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. రెండేళ్ల పోరాటం తర్వాత ఆ మహమ్మారిని పూర్తిగా వదిలించుకున్న గౌత‌మి.. క్యాన్స‌ర్ వ్యాధితో పోరాడే వారికి త‌ర‌చూ ప్రేరణ ఇస్తూ ఉంటుంది.

Sonali Bendre wears a 20 years old vintage jacket to Super Dancer 4; shares  throwback pic with Shah Rukh Khan - Times of India

సోనాలి బింద్రే: టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సోనాలి.. మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడి చావు చివరి అంచుల వరకు వెళ్ళింది. అమెరికాలో చికిత్స తీసుకున్న ఈమె మానసిక బలంతో, కుటుంబ‌స‌భ్యుల ధైర్యంతో క్యాన్స‌ర్‌ను జ‌యించింది.

క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచిన టాలీవుడ్‌ హీరోయిన్లు వీళ్లే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts