ఆ స్టార్ హీరో కోసం ఐటెం భామ‌గా మారుతున్న చిట్టి..?!

ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మ‌వుతుందేమో కానీ, చిట్టి అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. అనుదీప్ కెవి ద‌ర్శ‌క‌త్వంలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన `జాతిరత్నాలు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా.. చిట్టిగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సును గెలుచుకుంది. ఈ సినిమాలో ఫ‌రియా న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌టంతో.. ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి.

Faria Abdullah: జాతిరత్నాలు బ్యూటీకి బంపర్ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో  ఛాన్స్..

కానీ, ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాల‌ను ఎంపిక చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మంచి డ్యాన్స‌ర్ అయిన ఫరియా ఇప్పుడు ఓ సీనియ‌ర్ స్టార్ హీరో కోసం ఐటెం భామ‌గా మార‌బోతోంద‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. కింగ్ నాగార్జున‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగ్ ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `బంగార్రాజు` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

Bangarraju Movie (2022): Cast | Trailer | Songs | Release Date - News Bugz

2016లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంది. అలాగే నాగ చైత‌న్య‌, కృతి శెట్టిలు జంటగా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుంద‌ట‌. ఈ సాంగ్ కోసం మేక‌ర్స్ తాజాగా ఫ‌రియాను సంప్ర‌దించార‌ట‌. మంచి రెమ్యూన‌రేష‌న్ ఊడా ఆఫ‌ర్ చేశార‌ట‌.

Fariya Abdullah : 'బంగార్రాజు' సినిమాలో చిట్టి స్పెషల్ సాంగ్?? | Fariya  Abdullah Special Song in Bangarraju

దాంతో ఫ‌రియా వెంట‌నే ఓకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నాగార్జున‌, ఫరియాలపై చిత్రీకరించనున్న ఈ స్పెష‌ల్ సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉండనుంద‌ని తెలుస్తోంది. కాగా, ప్ర‌స్తుతం మైసూర్‌లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌పుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అలాగే ఈ మూవీకి ఈ అనూప్‌ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చుతుండ‌గా.. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితం అవుతోంది.

Share post:

Latest