వైష్ణ‌వ్ తేజ్‌కు ఘోర అవ‌మానం..మ‌రీ ఇంత దారుణ‌మా?!

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `ఉప్పెన‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వైష్ణ‌వ్.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లై.. వంద కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టింది.

Uppena: Vaishnav Tej Full Look out

ఇక వైష్ణ‌వ్ రెండో చిత్రం `కొండ పొలం`. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. అక్టోబ‌ర్ 8న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాకే తెచ్చుకున్నా.. క‌లెక్ష‌న్ల విష‌యంలో బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా బోల్తా ప‌డింది. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఐదు కోట్ల గ్రాస్, మూడు కోట్ల షేర్ మాత్రమే రాబ‌ట్టగ‌లిగింది.

Konda Polam trailer: Vaishnav Tej battles wild tiger and cunning men | Entertainment News,The Indian Express

సినిమాను తక్కువ బడ్జెట్లో తీసి, తక్కువ రేట్లకే అమ్మినా కూడా బయ్యర్లకు నష్టాలు తప్పడం లేదు. ఏదేమైనా.. తొలి సినిమాతో రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన వైష్ణ‌వ్.. రెండో సినిమాకు రూ.5 కోట్ల రేంజ్‌కే పడిపోవడం ఘోర అవ‌మాన‌మ‌నే చెప్పాలి.

Share post:

Popular