వాహనదారులకు శుభవార్త.. రూ.60 కే లీటర్ పెట్రోల్..!

ఈ మధ్యకాలంలో లీటర్ పెట్రోల్ ధర బంగారం లాగా రోజు రోజుకూ పెరిగిపోతోంది. మొన్నటి వరకు 70, 80 రూపాయలకే పరిమితమైన లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.113 పైగానే పలుకుతోంది.. ఇక భారతదేశంలో సామాన్యులు బెంబేలెత్తి విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలం డీజిల్ , పెట్రోల్ ధరలు మాత్రమే అని చెప్పవచ్చు. అయితే ఈ లీటర్ పెట్రోల్ ధర 60 రూపాయలకే అంటూ వాహనదారులకు ఒక అద్భుతమైన శుభవార్తను తెలిపింది కేంద్ర ప్రభుత్వం. అదేంటో మనం కూడా ఒకసారి చూద్దాం..

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్-డీజిల్‌పై నడిచే వాహనాలపై ఆధారపడకూడదు అని నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం రానున్న కాలంలో యూరో -6 ఉద్గార ప్రమాణాల ప్రకారం ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేయాలని.. వాహన తయారీదారులను ప్రభుత్వం సూచిస్తోంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవే రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ..స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.

ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌ కి, పెట్రోల్ రేటు తగ్గించడానికి మధ్య సంబంధం ఏమిటంటే..ఫ్లెక్సిబుల్ ఇంధనం అనేది గ్యాసోలిన్ , ఇథనాల్ కలయికతో తయారు చేయబడిన ప్రత్యామ్నాయ ఇంధనం. రానున్న కాలంలో కంపెనీలు అన్నీ ఈ ఇంజిన్ ఉన్న వాహనాలు డిజైన్ చేసుకుంటే.. పెట్రోల్-డీజిల్ తో అవసరం ఉండదు. ఈ ఇథనాల్ ధర లీటరుకు 60-62 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్ మాత్రం పక్కాగా అమలు చేయగలిగితే ప్రజలకు పెట్రోల్, డీజిల్‌ ని అధిక ధరకి కొనాల్సిన బాధలు తప్పుతాయి.