ఉదయభాను తెరపై కనిపించకపోవడానికి అసలు కారణం అదేనా?

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా,అలాగే బుల్లితెరపై యాంకర్ గా ఈమె అందరికీ సుపరిచితమే. తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అలాగే సమాజ పరిస్థితులపై, నిజ జీవిత అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తన స్పందన తెలియజేస్తూ ఉంటుంది. బుల్లితెరపై ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఈమెకు తన జీవితంలో అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి. అలా ఈమె ఇండస్ట్రీకి దూరం అయింది.

అయితే ఈమె కెరీర్ అద్భుతంగా సాగుతున్న నేపథ్యంలో కొందరు సెలబ్రెటీలు ఈమె ఎదుగుదలను చూసి ఓర్వలేక బాను గురించి మాట్లాడుతూ ఉండేవారట, అంతేకాకుండా ఎవరితోనో ఎఫైర్ ఉన్నాయంటూ అప్పట్లో పెద్దఎత్తున రూమర్లు పుట్టించారట. ఈ విధంగా ఉదయభాను మానసికంగా దెబ్బ తీసీ, క్రమంగా ఆమెకు అవకాశాలు లేకుండా చేశారట. ఇలా ఒకప్పుడు బుల్లి తెరపై ఒక వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇందుకు గల కారణం ఆమెకు ఇద్దరు కవల పిల్లలు జన్మించడం. పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలకు సంతానం కలగటంతో తన జీవితం మొత్తం తన పిల్లలకు అంకితం చేసింది. ఈ క్రమంలోనే తన పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యిందని సమాచారం.

Share post:

Latest