తెలుగు వాడయిండి.. తెలుగు రాని సూపర్ స్టార్.. కారణం..?

సూపర్ స్టార్ అనగానే మనకు గుర్తొచ్చే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు..నిజం చెప్పాలంటే మహేష్ బాబు ప్రయోగాలకు కొంచెం దూరంగా ఉంటాడని చెప్పాలి.. ఎక్కువగా కమర్షియల్ సినిమాలను మాత్రమే ఎంచుకుంటాడు అనే పేరు కూడా ఉంది.. ఇకపోతే ఆయన అప్పట్లో కౌబాయ్ లా మారి తీసిన సినిమా టక్కరి దొంగ.. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఆయన ప్రయోగాలు చేయడానికి ఇష్టపడటం లేదు..

 

మహేష్ బాబు తెలుగుతో పాటు తమిళ్ కూడా చాలా చక్కగా మాట్లాడగలరు.. ఇందుకు ఉదాహరణ గత సంవత్సరం స్పైడర్ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయగా , అప్పుడు సొంతంగా తన పాత్రకు తమిళ్ లో డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. మహేష్ బాబు కు తెలుగుతో పాటు తమిళ్ కూడా బాగా వచ్చు అని చెప్పాలి.. ఎందుకంటే ఆయన పుట్టింది , పెరిగింది మాత్రం చెన్నైలోనే కాబట్టి.. తెలుగు సినీ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి రాకముందు కృష్ణ కూడా అక్కడే నివాసం ఉండి సినిమాలు తీసే వాడు. అలా మహేష్ బాబు బాల్యమంతా చెన్నై లోనే సాగింది.

అందుకే తెలుగుతో పాటు తమిళ్ కూడా బాగా నేర్చుకున్నాడు. ఇక మహేష్ కు తమిళం కూడా రాయడం వచ్చు కానీ తెలుగు రాయడం , చదవడం మాత్రం రాదట. మహేష్ బాబు చిన్నతనం నుండే చెన్నై పాఠశాలలో చదువుకోవడం వల్ల అతనికి తమిళం అలవాటు పడింది ..కానీ తెలుగు రాయడం, చదవడం అలవాటు పడలేదు. విద్యాభ్యాసం విషయానికి వస్తే, పదో తరగతి వరకు చెన్నైలో ఉన్న సెయింట్ బెడ్ స్కూల్లో పూర్తి చేసి, లయోలా కాలేజీలో కామర్స్ లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఇక తండ్రి బాటలోనే నటుడిగా మారి, ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నారు.