తెలుగోన్ని గెలిపించి ఆంధ్రుల్లో ఐక్యత ఉందని చాటుతారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో మా అధ్యక్ష పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు పోటీ పడుతున్నారు. కానీ వీరిద్దరూ కూల్ గా ప్రచారం చేసుకోకుండా రాజకీయవేత్తల మాదిరిగా మాటల తూటాలు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రముఖులు నుంచి .. ఇతర సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి పోటీ చేయవచ్చు కానీ ఎలా పరిపాలిస్తాడు అంటూ వార్తలు వచ్చిపడుతున్నాయి..

తెలుగు వాళ్ళు అయ్యి ఉండి ఒక తెలుగు వాన్ని ఐకమత్యంగా గెలిపించలేకపోతే .. ఎందుకు ఈ తెలుగువాళ్లు అంటూ మరికొంత మంది సీనియర్లు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.. నిజానికి మంచు విష్ణు తెలుగు వాడు కాబట్టి అతడిని గెలిస్తేనే తెలుగు సినీ కార్మికులకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఆదుకుంటాడు అని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రకాష్ రాజ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడు అతడు వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీ కార్మికులతో ఎలా మైకం అవుతాడు.. వారి సమస్యలను ఎలా తెలుసుకుంటాడు అని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ మంచు విష్ణు అధ్యక్ష పదవిని చేపట్టాలని కోరుకుంటూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ప్రకాష్ రాజ్ విజయం సాధిస్తే.. తెలుగు సినీ కార్మికులలో ఐకమత్యం లేదని అన్ని రాష్ట్రాల వారు హేళనగా చూస్తారు అంటూ వాపోతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ విజయం సాధిస్తాడా లేక మంచు విష్ణును గెలిపించి తెలుగు వాళ్ల ఐక్యమత్యం ఏమిటో నిరూపిస్తారా..? అనే విషయం తెలియాలంటే అక్టోబర్ 10వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

Share post:

Latest