ఈ హీరో కోసం తెగ‌ టెన్ష‌న్ ప‌డుతున్న త‌మ‌న్నా..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు ఓ టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌. అది కూడా ఓ హీరో కోస‌మ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి. అస‌లు మ్యాట‌రేంటంటే.. చిరంజీవి ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. తమిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది.

Megastar Chiru Picked Tamanna Over Her Friend -

అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా త‌మ‌న్నా ఖ‌రారు అయిందని ఎప్ప‌టి నుంచో జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ, అఫీషియల్ గా ఆమె నటిస్తున్నట్టు అనౌన్స్‌మెంట్ మాత్రం మేక‌ర్స్ ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడీ విష‌య‌మే త‌మ‌న్నాను క‌ల‌వ‌ర పెడుతుంద‌ట‌. ఎందుకంటే, నెట్టింట వార్త‌లైతే వ‌చ్చాయి కానీ.. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఆ మూవీ నిర్మాత‌లు త‌మ‌న్నాను సంప్ర‌దించ‌నేలేద‌ట‌.

Official: Chiru 154 titled Bhola Shankar! First Look Out Now! "Telugu Movies, Music, Reviews and Latest News"

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం..వేరే హీరోయిన్‌ను ఎంపిక చేస‌ ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అందుకే చిరు సరసన న‌టించే మంచి అవ‌కాశం ఎక్కడ మిస్ అవుతుందోనని త‌మ‌న్నా ఆందోళ‌న చెందుతుంద‌ట‌. కాగా, గ‌తంలో చిరు న‌టించిన సైరాలో త‌మ‌న్నా న‌టించింది. అయితే అందులో చిరుకు జోడీగా కాకుండా..ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది.

Share post:

Latest