త‌మ‌న్నా న‌యా ప్లాన్‌..సీనియ‌ర్ హీరోలే టార్గెట్‌..?!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తైనా ఇంకా త‌న హ‌వాను కొన‌సాగిస్తూనే ఉన్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

- Advertisement -

Tamannaah Bhatia tests positive for COVID 19; Admitted to a private hospital in Hyderabad | PINKVILLA

ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె అందుకునే రెమ్యునరేషన్ కోటిన్నరకు మించడం లేదు. అందుకే ఈ భామ సీనియ‌ర్ హీరోల‌ను టార్గెట్‌గా చేసుకుని త‌న రెమ్యూన‌రేష‌న్‌ను పెంచుకునేందుకు న‌యా ప్లాన్ వేసింద‌ట‌. ఈ మ‌ధ్య కాలంలో బాల‌య్య‌, చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లు దొర‌క‌డం ఎంత క‌ష్ట‌మైపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Tamanna Bhatia: 'November Story' Equipped Me To Explore Novel Creative Nuances

ఇప్పుడు ఈ విష‌యాన్నే త‌మ‌న్నా త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటుంద‌ట‌. ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా సీనియ‌ర్ హీరోల‌తో జ‌త క‌ట్టేందుకు త‌మ‌న్నా ముందుకొస్తుంద‌ట‌. అదే స‌మ‌యంలో రెమ్యూన‌రేష‌న్‌ను కూడా భారీ డిమాండ్ చేస్తోంద‌ట‌. దాంతో మ‌రో అవ‌కాశం లేక కొంద‌రు నిర్మాత‌లు ఆమె ఆడిగినంతా ఇచ్చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Popular