`అఖండ`పై కొన‌సాగుతున్న‌ సస్పెన్స్.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌..!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను మే నెల‌లోనే విడుద‌ల చేయాల‌నుకున్నారు.

- Advertisement -

Akhanda Makers Break Their Silence Finally

అయితే క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు విడుద‌ల వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం మూవీ ల‌వ‌ర్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, మేక‌ర్స్ రిలీజ్ డేట్‌ను మాత్రం ప్ర‌క‌టించ‌డం లేదు. దాంతో అఖండ విడుద‌ల‌పై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉండ‌డంతో.. నంద‌మూరి అభిమానులు తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నారు.

BB3 Akhanda: Fierce

ఇక మొన్న‌టి దాకా న‌వంబ‌ర్‌లో అఖండ విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. డిసెంబ‌ర్ 24కు అఖండ షిప్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇదైనా నిజ‌మో..కాదో..తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, ఈ చిత్రంలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నుండ‌గా.. త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

Share post:

Popular