హాస్ప‌ట‌ల్‌లో చిరంజీవి..కుడి చేతికి స‌ర్జ‌రీ..ఖంగారులో ఫ్యాన్స్‌!

మెగాస్టార్ చిరంజీవి హాస్ప‌ట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఆయ‌న కూడి చేతికి స‌ర్జ‌రీ కూడా జ‌రిగింది. కానీ, ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అదివారం హైదరాబాద్‌లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ వేదికగా జరిగిన ఓ సమావేశంలో మెగాస్టార్ పాల్గొన్నారు. అయితే ఆయన కుడి చేతికి బ్యాండేజ్ ఉండ‌డంతో.. అభిమానులు ఖంగారు ప‌డిపోయారు.

Chiranjeevi : కుడి చేతికి సర్జరీ చేశారు.. అభిమానులు ఆందోళన చెందకండి.. | Chiranjeevi

వారి కలవరపాటును గమనించిన చిరంజీవి.. స‌మావేశంలో మాట్లాడుతూ చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని తెలిపారు. ఇటీవల కుడి చెయ్యి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించడంతో.. వాళ్లు మణికట్టు దగ్గరున్న నరం మీద ఒత్తిడి పడిందన్నారని చెప్పారు.

Chiranjeevi: మెగాస్టార్ చేతికి సర్జరీ.. గాడ్ ఫాదర్ షూట్ కి బ్రేక్.. అసలు ఏమైదంటే? | carpal tunnel syndrome surgery to megastar chiranjeevi right hand - Telugu Filmibeat

అందుకోసం శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సి అవసరం లేదని 15 రోజుల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. కాగా, చిరంజీవి సినిమా విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న ఆచార్య‌, గాడ్ ఫాదర్ చిత్రాలు చేస్తున్నాడు. అలాగే బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం మ‌రియు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళ శంక‌ర్ చిత్రం కూడా చిరు చేయ‌నున్నాడు.