శింబు నటించిన లూప్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన నాని..!

కోలీవుడ్ స్టార్ హీరోలలో శింబు కూడా ఒకరు. శింబు నటిస్తున్న తాజా చిత్రం”మనాడు”తెలుగులో”ది లూప్” పేరుతో వస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ వెంకట్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించి కొద్ది గంటల ముందే ట్రైలర్ విడుదలైంది ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది తాజాగా ఈ సినిమాలో తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమాని థియేటర్లలలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శింబు కి జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎస్.జె.సూర్య ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్లో శింబు ఎంతో అమాయకంగా తుపాకి పట్టుకొని నిలుచున్నాడు. ఈ సినిమా ఫుల్ యాక్షన్, రాజకీయంగా తెరకెక్కిస్తున్నట్లు మనకి కనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ చూసిన మేరకు ఎస్.జె.సూర్య శింబు పాత్రలు హైలైట్ కనిపిస్తున్నాయి.

Share post:

Latest