ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి తండ్రే కారణం శత్రుఘ్న సిన్హా?

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆర్యన్ ఖాన్ కి అలాగే అతని కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా షారుఖాన్ అభిమానులు కూడా అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందించి గా, తాజాగా సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి కారణం తన తండ్రి షారుక్ ఖానే అని తెలిపాడు.శత్రుఘ్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ఈ విషయం పై పోరాటానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

ఇది వేరొకరి సమస్య దీనిని వారే పరిష్కరించుకోవాలి అనుకుంటున్నారు. ఇండియాలోనే మీడియా లాగానే ఇక్కడ వ్యక్తులు సైతం భయపడుతున్నారు అయితే ఆర్యన్ లక్ష్యంగా మారడానికి అసలు కారణం అతని మతమే అని అభిప్రాయపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు ఏది ఏమైనా కూడా అతను భారతీయుడే అని తెలిపారు. ఈ కేసు విషయంలో మున్మున్ దమేచా,అర్బాజ్ మర్చంట్ వంటి వారు ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా బాధ్ షా సెలబ్రిటీ కావడమే కారణం అని చెప్పాడు.

Share post:

Latest