షారుక్ ఖాన్ కొడుకుకు విముక్తి..దీవాలి ముందే వచ్చిందంటున్న షారుక్..?

మూడు వారాలకు పైగా జైలు జీవితాన్ని గడిపిన ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్రూయిజ్ షిప్ పార్టీపై డ్రగ్స్ దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత షారుఖ్ ఖాన్ 23 ఏళ్ల కుమారుడు అక్టోబర్ 3వ తేదీ నుండి కస్టడీలో ఉన్నారు. ఆర్యన్ ఖాన్ కు గతంలో రెండు సార్లు బెయిల్ నిరాకరించిన సంగతి మనకు తెలిసిందే.

బుధవారం అతనికి బెయిల్ నిరాకరించిన ప్రత్యేక మాదకద్రవ్యాల నిరోధక న్యాయస్థానం అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ షూలో దాచిన చరస్ గురించి అతనికి తెలుసునని పేర్కొంది. ఆర్యన్ తో పాటు మరో 18 మందిని అరెస్టు చేయడం జరిగింది.

ఇక ఈ రోజున బెయిల్ కావడంతో షారుక్ ఖాన్ ఫ్యామిలీ లో ఆనంద భాష్పాలు మొదలయ్యాయి. ఇక పెద్ద ఎత్తున షారుఖాన్ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. తన కొడుకు రావడంతో షారుక్ ఖాన్ దీపావళి పండగ మాత్రం ముందే వచ్చిందని చెప్పుకుంటూ తెగ సంబరాలు చేస్తున్నాడు.