విడాకుల తర్వాత తొలిసారి ఎన్టీఆర్ షోకి గెస్ట్ గా సమంత?

గత కొద్దిరోజులుగా నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారానికి సంబంధించి ఏ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి మనందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య, సమంతలు విడిపోవడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చైతన్య సమంత జరిగిన విషయాన్ని మర్చిపోయి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి పోయినట్లు తెలుస్తోంది. విడాకుల తర్వాత నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నారు. అంతేకాకుండా త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా కూడా ఆ కనిపించబోతున్నారు.

- Advertisement -

కానీ సమంత మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాల్లో కానీ నేరుగా కనిపించలేదు. ఇక తాజాగా ఆమె ఎన్టీఆర్ సోలో కనిపించబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు రియాల్టీ షో లో సమంత పాల్గొన్న పోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తయినట్లు టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఈ నెల చివరిలో కానీ లేదా వచ్చే నెల ప్రారంభంలో కానీ ప్రసారం కానుందని సమాచారం.

Share post:

Popular