సలార్ టీమ్ తప్పని తిప్పలు..?

ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి అనేక రకాలైన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇలాంటివన్నీ అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరొకసారి సలార్ సినిమాకు సంబంధించి ఒక సీన్ విడుదల కావడం వల్ల.. ఆ సీన్ కాస్తో వైరల్ గా మారుతుంది.

ఇక ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించిన లొకేషన్ సీను కూడా లీక్ అవడంతో చిత్ర నిర్మాతలు, ఆశ్చర్య పోతున్నారు. దీంతో వెంటనే లీకేజీల గల కారణం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు.వీలైనంత వరకు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నారట. లీకుల విషయంలో పుష్పా టీంకు ఇలాగే జరగడంతో ఎవరిని కూడా లోపలికి మొబైల్స్ తీసుకురావద్దని ఆంక్షలను విధించడం జరిగింది.

ఇక ఇప్పుడు సలార్ టీం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకు ఉన్నట్లుగా సమాచారం. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదల అవుతున్నది.కానీ ఈ సినిమా కంటే ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ నిల్ KGF-2 ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు గా తెలియజేశాడు. అయితే సలార్ సినిమా మరి కొన్ని నెలలు వాయిదా పడినట్లు కనిపిస్తోంది.

https://youtu.be/06M0pMiuB4Y?t=1