కరీనాని కంట్రోల్ చెయ్యను.. సైఫ్ అలీ ఖాన్!

బాలీవుడ్ సైఫ్,అలీ ఖాన్ కరీనా కపూర్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దంపతులకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సినిమాల్లో నటిస్తూనే ఎంత బిజీగా ఉన్నప్పటికీ.వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కరీనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే, సైఫ్ అలీఖాన్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇటీవల సైఫ్అలీఖాన్ ఒక ఇంటర్వ్యూలో కరీనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం పై పోస్టులు పెట్టడం పై స్పందన ఏంటి అడగగా దానికి సైఫ్ ఇలా సమాధానమిచ్చాడు.

స్వచ్ఛమైన పెళ్లి బంధంలో ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడం ఉండదు. ఇద్దరూ ఎవరికి నచ్చింది వారు చేయవచ్చు. కరీనా మల్టీ టాస్కర్. ఆమె ఏ విధంగా చేయాలనుకుంటుంది అది చేస్తుంది. అందుకు నేను తనకు అంతగా సలహాలు ఇవ్వను అని తెలిపారు. సోషల్ మీడియా విషయంలోనే కాకుండా మామూలు విషయాలు కూడా కరీనాకు సలహాలు ఇవ్వను. ఏం చేయాలో తనకి బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు సైఫ్ అలీ ఖాన్.

Share post:

Popular