అవన్నీ నిజాలు కావు.. రియా చక్రవర్తి సీక్రెట్స్ రివీల్?

బుల్లితెరపై ప్రసారమయ్యే షో లలో బిగ్ బాస్ షో కి ఉన్న పాపులారిటీ గురించి మనందరికీ తెలిసిందే. చాలామంది ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అని ఆశ పడుతూ ఉంటారు. అలాగే మరి కొందరు ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది అంటే ఎగిరి గంతేస్తారు. ఇదిలాఉంటే ఇటీవల బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బిగ్ బాస్ సీజన్ 15 లో పాల్గొన్న పోతున్నట్లు వార్తలు జోరుగా కొనసాగాయి. ఈ షోలో పాల్గొన్నందుకు యాజమాన్యం వారానికి దాదాపుగా 35 లక్షల ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే తాజాగా ఈ విషయాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

బిగ్ బాస్ టీవీ షో లో నేను పాల్గొనబోతునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలో ఇటువంటి నిజం లేదని క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఇది పెడుతున్న. నేను బిగ్ బాస్ షో లో పాటిస్పేట్ చేయడం లేదు,అని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రియా చక్రవర్తి తెలిపింది. రియా చక్రవర్తి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అన్ని ఒక్కసారిగా పటాపంచలై పోయినట్లు అయింది. ఇకపోతే ఈమె విషయానికి వస్తే ప్రస్తుతం షో లో సినిమాలు చేస్తూ బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.