రెబల్ స్టార్ ఆశీస్సులు పొందిన మంచు విష్ణు..!

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజు మంచు విష్ణు మధ్య పోటీ చాలా రసవత్తరంగా మారుతోంది. మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తామని అంటూ ఇద్దరు బరిలోకి నిలిచారు. ఇదే క్రమంలో ప్రకాష్ రాజ్ కి మెగాస్టార్ అండ లభించింది. ఇక ఇదే నేపథ్యంలో మంచు విష్ణు మిగిలిన సినీ పెద్దల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇక ఇదే క్రమంలో తాజాగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు తో మంచు విష్ణు భేటీ అయి మా ఎన్నికలకు తన మద్దతు కావాలి అన్నట్టుగా చూసిన కోరారు. ఇక అంతే కాకుండా కృష్ణంరాజుతో కలిసి దిగిన ఫోటోను కూడా మంచు విష్ణు షేర్ చేశారు. రియల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు నుంచి ఆశీస్సులు అందాయి అంటూ మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

ఇక అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జరుగనున్నాయి మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్ మంచి విషయం మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారని విషయంపై చాలా ఉత్కంఠగా ఉన్నారు ప్రేక్షకులు.

Share post:

Latest