సిగ్గులేని రాజకీయాలు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన నటి?

బాలీవుడ్ లో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఇష్యు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. డ్రగ్స్ కేసు విషయంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ఎం సిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ తో పాటుగా మరో ఏడుగురు ఎన్సీబీ అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక ఈ విషయంపై ఆర్యన్ ఖాన్ కి పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. అలాగే షారుక్ ఖాన్ ను అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషన్ కోర్టు కొట్టివేయగా వారిని ఆర్థర్ రోడ్డు జైలులో తరలించారు.

ఇది ఇలా ఉంటే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో సీనియర్ నటి రవీనా టండన్ ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టింది. ఆ పోస్టులో సిగ్గులేని రాజకీయాలు, ఒక యువకుడు జీవితంతో తన భవిష్యత్తుతో ఆడుకుంటున్నాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వారి స్వలాభం కోసం ఇలా చేయడం బాధాకరమని ఆమె తెలిపింది. అయితే ఆర్యన్ ని కావాలనే ఈ కేసులో ఇరికించారు అంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు ఆరోపిస్తున్నారు. వేరే ఏదో కేసును పక్కదోవ పట్టించడానికి ఇలా చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.