అదే జరిగితే నేను కూడా ఫామ్ హౌస్ కొంటాను.. రణ్ వీర్ సింగ్?

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన రణ్ వీర్ సింగ్ త్వరలోనే బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు. బిగ్ పిక్చర్ అనే టీవీ షో కి హోస్ట్ గా వ్యవహరించ బోతున్నాడు. ఈ షోకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఈ బిగ్ పిక్చర్ షో కనుక హిట్ అయితే సల్మాన్ ఖాన్ లాగే తాను కూడా ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ కొంటాను అని చెప్పుకొచ్చాడు రణ్ వీర్ సింగ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

నా భార్య పిల్లలతో కలిసి ఉండటానికి ఒక మంచి ఇల్లు చూస్తున్నానని, అందులో పిల్లలు ఆడుకునేందుకు ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి. అంతేకాకుండా ఆ ఇంట్లో అందరం సంతోషంగా ఆరోగ్యంగా జీవించగలగాలి. ఇదే నా జీవితంలో బిగ్ పిక్చర్ అని రణ్ వీర్ చెప్పుకొచ్చాడ. కాకపోతే దీపిక, రణ్ వీర్ సింగ్ లు ఇటీవలే అలీ బాగ్ లో కోట్లు విలువ చేసే బంగ్లాను సొంతం చేసుకున్నారన్న విషయం అందరికి తెలిసిందే. ఇందుకోసం వారు 22 కోట్లు వెచ్చించారని వార్తలు వినిపించాయి. ఆ బంగ్లా 5 బెడ్ రూమ్ ల తో సువిశాలంగా ఉంటుందట.