రాజమౌళి జాగ్రత్త పడకపోతే ఆర్ ఆర్ ఆర్ అంతేనా..?

బాహుబలి సినిమా తర్వాత మల్టీస్టారర్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.. ఇక విడుదల చేద్దామని నిర్ణయించుకున్న ప్రతిసారీ కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలు రావడం, ఈ సినిమా దర్శకుడు వెనక్కి తగ్గడం జరుగుతోంది. ఇక పోతే కనీసం దసరా కైనా విడుదల చేస్తారని ప్రకటించినప్పటికీ సినిమాను విడుదల చేయలేక పోయారు వచ్చే సంవత్సరం విడుదల చేస్తారని అనుకుంటే అప్పుడు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు సినిమా మేకర్స్..

భారీ బడ్జెట్ సినిమా కు ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా.. వందల కోట్లు కుమ్మరించి సినిమా హక్కులను కొనుక్కుంటూ ఉంటారు. అలాంటిది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి మార్కెట్ రేట్ అనుకున్నదానికంటే తక్కువ పలుకుతోంది. ముఖ్యంగా ఆంధ్రా ఏరియాలో ‘ఆర్ఆర్ఆర్’ మార్కెట్ విలువ దాదాపు ముప్పై శాతం తగ్గించి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కరోనా తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్దగా రావడం లేదు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ రేట్లు తగ్గించి అమ్ముతున్నారట.

అంతే కాదు వంద కోట్ల బిజినెస్ జరగాల్సిన ఈ సినిమా 70 కోట్ల బిజినెస్ కూడా జరగడం లేదు.. మొత్తానికి చూసుకుంటే బాగా లాస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంచనాలు వేస్తున్నారు సినిమా మేకర్స్.