రైతులపై దూసుకు వెళ్ళిన కారు.. బిజెపి నేతల అరాచకం.. వీడియో వైరల్..!

దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారిన వీడియో ఇదే. యూపీలోని లఖింపర్ ఖేరి అరాచకాన్ని ఇంతవరకు కేవలం విన్నాము అందుకు సంబంధించిన వీడియో తాజాగా ఇప్పుడు బయటికి వచ్చి వైరల్గా మారుతుంది. ఇక తమ దారిన తాము నడుచుకుంటూ వెళుతున్న రైతులపై ఏమాత్రం కనికరం లేకుండా వాహనంతో దేశం ముందుకు వెళ్లిన బిజెపి నేతల అరాచకం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియోలో కనిపిస్తోంది.

- Advertisement -

అధికారంలో ఉన్నంత మాత్రాన మనుషుల ప్రాణం వీరికి లెక్కలేనంత స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. కేవలం ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు సినిమాల్లో మాత్రమే చూశాము కానీ ఇప్పుడు రియల్ గా చూడ వలసిన పరిస్థితి ఏర్పడింది.ఇంత జరిగినప్పటికీ తన కుమారుడి ఘటన తన దగ్గర లేదన్న కేంద్ర సహాయ మంత్రి మాట వింటే ఆయన మాటలకు చేతలకు మధ్య ఉన్న తేడా ఉందో, ఎంత దిగజారడో అర్థమవుతుంది.

ఇక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కూడా అలవాటే అన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తుంది. అప్పట్లో కూడా ఒకసారి ఆగ్రహానికి గురైన సందర్భాలు ఉన్నట్లు సమాచారం. ఒకసారి తాను రంగంలోకి దిగితే మీరు ఉన్న ప్రాంతమే కాదు ఆ చుట్టుపక్కల కూడా ఉండలేరు అన్నమాట ఆయన ఉన్నట్లుగా సమాచారం.ఇలాంటి వారి చేతుల్లో అధికారం ఉంటే ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో అంటే కాంగ్రెస్ నేతలు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మోడీ ఈ విషయంపై ఎందుకు స్పందించలేదు అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.

Share post:

Popular