పునీత్.. రియల్లీ “ఐ మిస్ యు’ అంటున్న టాలీవుడ్ డైరెక్టర్..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కన్నడ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. హీరో మరణవార్త వినగానే అటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఈ హీరో పై టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏ విధంగా స్పందించడో ఇప్పుడు చూద్దాం.

పునీత్ మృతి నాన్న షాప్ గురిచేసింది. తన తొలి సినిమాను “అప్పు” నేనే తీసాను. అతడు చాలా మంచి వ్యక్తి అని, చిన్న వయసులోనే పునీత్ మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, అంతే కాకుండా కొద్ది రోజుల కిందటే మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నామని, త్వరలోనే కలుద్దాం అని కూడా అనుకున్నామని కానీ ఇంతలోనే ఇలా జరగడం చాలా బాధ వేస్తుంది అన్నారు పూరి జగన్నాథ్.

పునీత్ మరణించడం ఆయన కుటుంబ సభ్యులకే కాదు, కన్నడ చిత్రసీమకు తీరని లోటు అని,”ఐ లవ్ యు పునీత్” రియల్లీ ఐ మిస్ యు అంటూ పూరి జగన్నాథ్ ఆగ్రహానికి గురయ్యాడు.

Share post:

Popular