మ‌ర‌ణంపై పునీత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. వింటే క‌న్నీళ్లాగ‌వు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ ఇక‌లేర‌న్న సంగ‌తి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను హుఠాహుఠిన బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ప‌రిస్థితి అప్ప‌టికే చేయి దాట‌డంతో చికిత్స పొందుతూనే పునీత్ తుదిశ్వాస విడిచారు.

Sportstars express shock, sadness over Puneeth Rajkumar's death | Sports News,The Indian Express

ఇక పునీత్ మ‌ర‌ణం యావ‌త్‌ సినీ ప‌రిశ్ర‌మ‌నే విషాదంలోకి నెట్టేసింది. మ‌రోవైపు అభిమానులు ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఆయన భవిష్యత్తు గురించి, మ‌ర‌ణం గురించి చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

Puneeth Rajkumar: Soon, we will have Kannada web shows as well | Bengaluru - Hindustan Times

ఓ ఇంటర్వ్యూలో పునీత్.. `భవిష్యత్తు మన చేతిలో లేదు. మ‌ర‌ణ‌మూ మ‌న చేతిలో ఉండ‌దు. ఎలా జ‌ర‌గాల‌నుకుంటే అలానే జ‌రుగుతుంది. విధి రాతను ఎవరూ మార్చలేరు’ అంటూ చేసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి. కాగా, పునీత్‌ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరు కంఠీరవ స్టేడయంలో ఉంచనున్నారు. అలాగే ఆయ‌న‌ అంత్యక్రియలు శనివారం తండ్రి సమాధి దగ్గరే నిర్వహించబోతున్నారు.

 

Share post:

Popular