పునీత్ పవర్ స్టార్ పేరు వెనుక ఇంత కథ ఉందా..?

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో ఆయన అభిమానులు ఎంతో బాధ పడుతున్నారు. సినీ ప్రముఖులు ఈయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. నిన్నటి రోజున జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి చేర్చడం జరిగింది.

- Advertisement -

మొదటిసారిగా అప్పు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు పునీత్. అలా విభిన్నమైన కథలతో దాదాపుగా 30 సినిమాల వరకూ హీరోగా నటించాడు. ఈ సినిమాలలో ఎక్కువగా వంద రోజులకు పైగా థియేటర్లలో ఆడడం విశేషం. అందుచేతనే ఆయన అభిమానులు పునీత్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా పునీత్ రాజ్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.

హీరో కన్నడ లోనే కాకుండా ఇతర భాషలలో సైతం.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో పునీత్ రాజ్ కూడా ఒకరు. తను మరణించిన తర్వాత కూడా తన రెండు కళ్ళను దానం చేశాడు హీరో పునీత్. ఇక ఈయన కొన్ని సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించాడు.

Share post:

Popular