ప్రపంచంలోనే అతి ఖరీదైన పిసినారి..మహిళ ఎక్కడుందో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పది నగరాలలో న్యూయార్క్ కూడా ఒకటి. అక్కడ సగటు మనిషి జీవించాలంటే కనీసం వారు 1341 డాలర్ల అన్న సంపాదించాలి. అంటే మన భాషలో ప్రస్తుతం లక్ష రూపాయలు అన్నమాట. ఇక ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టాలంటే నోరెళ్ళ పెడతాం. ఎంత తగ్గించుకున్న కనీసం వెయ్యి డాలర్ల వరకు ఖర్చు అవుతుంది.

కానీ ఒక మహిళా మాత్రం కేవలం రెండు వందల డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అది కూడా అంత ఖరీదైన నగరంలో మరి అంత తక్కువ ఖర్చుతో ఆ మహిళ ఎలా జీవిస్తుందని అనుకోవచ్చు. అంతేకాకుండా ఆమె అకౌంటెండ్ గా కూడా పని చేస్తోంది.

అలా వచ్చిన డబ్బులు కేవలం రెండు వందల డాలర్లు అని వాడుకుంటోంది. కేవలం తన తిండికోసం, ఇంటి అద్దె కోసం మాత్రమే అంత ఖర్చు చేస్తోందట. 1998 నుంచి ఇప్పటి వరకూ ఆమె కొత్త దుస్తులను కొనుగోలు చేయలేదట. అంతే కాకుండా బట్టలను కూడా సొంతంగా ఉతుకుతుంది. తన ఇంట్లో కి కావాల్సిన సామాన్యులను కూడా చెత్త నుండి ఏరుకొని వస్తుందట. ఇక ఆమె పడుకొని మంచము కూడా ఒక చెత్త లోనుంచి ఏరుకొని తెచ్చుకున్నదట. తన జీవితంలో డబ్బును పొదుపు చేసుకోవాలని మార్గాలను కనుగొన్నానని, న్యూయార్క్ వంటి నగరాలలో జీవనం అంటే ఖరీదైన వ్యవహారం అని చెప్పుకొచ్చింది కేట్ హషిమోటో