ప్రకాష్ రాజ్ ‘మా ‘ రాజీనామాపై ..మంచు విష్ణు రియాక్షన్ !

హోరా హోరీగా జరిగిన ‘మా’ ఎలక్షన్స్ ఎన్నికల ఘట్టం నిన్న అంటే ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. మా ఎన్నికలలో మంచు విష్ణుకు అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కి మధ్య గట్టిగానే పోటీ జరిగింది అని చెప్పవచ్చు. అయితే ఈ మా ఎన్నికల్లో విజయం మాత్రం మంచు విష్ణునే వరించింది అని చెప్పాలి. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకాష్ రాజ్ ప్రకటించారు.మా ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణుకు అభి నందనలు తెలియచేస్తూనే తన రాజీనామాను అంగీకరించాలని, ఇకనుంచి మా లో నాన్ మెంబర్ గా మాత్రమే సేవలు అందిస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో తామిద్దరం కలిసి పనిచేద్దామని మంచు విష్ణు వాట్సాప్ కు పెర్సనల్ గా ప్రకాష్ రాజ్ మెసేజ్ చేశారు.ఈ మెసేజ్ పైమంచు విష్ణు స్పందిస్తూ ఇలా జవాబు ఇచ్చారు.‘డియర్ అంకుల్ మీ అభినందనలకి నా కృతజ్ఞతలు. కానీ మీరు తీసుకున్న నిర్ణయానికి నేను చింతిస్తున్నాను. మీరు నాకన్నా వయసులో, అనుభవంలో పెద్దవారు. గెలుపు, ఓటములు అనేవి బొమ్మా, బొరుసు లాంటివి వాటిని మనం చాలా ఈజీగా తీసుకోవాలి.ఈ ఓటమిని మీరు ఎమోషనల్ గా తీసుకోవద్దని, మీరు కూడా మా కుటుంబంలో ఒక సభ్యులే. మీ ఐడియాలు మా కి చాలా అవసరం ఇంకా నాకు రిప్లై ఇవ్వకండి త్వరలోనే కలుద్దాం అని విష్ణు జవాబు ఇచ్చాడు..  

Share post:

Latest