డ్రామాలు దొబ్బకు.. ఆ యంగ్‌ హీరోపై ప్ర‌భాస్ ఫైర్‌..!

ఎప్పుడూ ఎంతో కూల్‌గా, సాఫ్ట్‌గా ఉండే ప్ర‌భాస్‌.. తాజాగా ఓ యంగ్ హీరోపై ఫైర్ అయ్యారు. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్‌ పూరి. పూర్తి వివ‌రాల్లోకి ఆకాష్ తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు.

- Advertisement -

Puri Jagannadh Shares New Poster of Akash Puri, Ketika Sharma Starrer Romantic

అలాగే అక్టోబరు 29న ఈ మూవీ విడుద‌ల కానుంది. అయితే పూరి జ‌గ‌న్నాథ్‌పై ఉన్న అభిమానంతో.. ప్ర‌భాస్ రొమాంటిక్ చిత్రాన్ని తెగ ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ‌ల‌ను ఇంట‌ర్వ్యూ చేశారు ప్ర‌భాస్‌. ఈ ఇంట‌ర్వ్యూలో ప్రభాస్ తనదైన స్టైల్లో పంచులు వేస్తూ.. ఆకాష్-కేతికాల‌ను బాగానే ఆట‌ప‌ట్టించాడు. ఇక సినిమా గోవాలో షూట్ జరిగిందని తెలుసుకున్న ప్ర‌భాస్‌.. షూటింగ్ గ్యాప్‏లో అక్కడ ఏం చేశారు.. ఎక్కడికి వెళ్లారు అంటూ ప్రశ్నించారు.

Akash Puri Takes Blessings From Prabhas | Romantic Movie | Ketika Sharma | TheNewsQube.com - YouTube

అయితే షూటింగ్‌లో గ్యాపే దొర‌క‌లేద‌ని చెప్పుకొచ్చారు ఆకాష-కేతిక. ఇక ఇష్ట‌మైన ఫుడ్ గురించి చెప్ప‌మ‌న‌గానే..గోవాలో ఏ హోట‌ల్లో ఏ ఫుడ్ బాగుంటుందో చ‌క్క‌గా వివ‌రించేశాడు ఆకాష్‌. దీంతో ప్రభాస్.. డ్రామాలు దొబ్బకు.. ఇంతకు ముందు అడిగితే ఎక్కడికి వెళ్లలేదు.. షూటింగ్‏కే పరిమితం అయ్యాం.. ఖాళీ లేదు అన్నారు.. ఇప్పుడేంటి ఇలా అన్ని చెబుతున్నారు.. పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ స‌ర‌దాగా సీరియస్ అయ్యారు. మొత్తానికి వీరి సంభాషణ మాత్రం సూప‌ర్ ఫ‌న్నీగా సాగింది. అలాగే చివ‌రిగా ప్ర‌భాస్.. రొమాంటిక్‌ చిత్రం భారీ హిట్ కావాల‌ని ఆకాంక్షించారు.

Prabhas About The Greatness Of Puri's Wife

 

Share post:

Popular