ప్రభాస్ కోసం అప్పుడు సాహో.. ఇప్పుడు సాలార్..!

ఇక ఈ మధ్య కాలంలో సినిమాకి హైలెట్ గా నిలవాలంటే ఎక్కువగా ఐటమ్సాంగుల ని ఉపయోగిస్తారు మన హీరోలు. ఇక ఇదే తంతు లో స్టార్ హీరోయిన్లు సైతం కూడా ఐటెం సాంగులో నటించి డబ్బును క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే టాప్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్ లో నటించడానికి సై అంటున్నారు. ఇదే పాటలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఒక పాటలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వంలో లో తెరకెక్కిస్తున్న చిత్రం సాలార్. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతోంది. అందుకోసం హీరోయిన్ శ్రద్ధ ని తీసుకున్నట్లుగా సమాచారం. వాస్తవానికి ఈ పాటలు ప్రభాస్ తో కలిసి శ్రీనిధిశెట్టి డాన్స్ చేస్తుందనే వార్తలు వచ్చినప్పటికీ. ఆమె ఆల్రెడీ కే జి ఎఫ్ లో హీరోయిన్ గా నటించింది కాబట్టి ప్రశాంతత ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

అయితే సాలార్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో ఉంది కాబట్టి ఆ చిత్రానికి తగ్గట్టుగానే క్రేజీ హీరోయిన్ ని పెడితే బాగుంటుందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు అనుకుంటున్నారట. ఇక ఈ భామ ప్రభాస్ తో సాహో సినిమాలో నటించింది. కాబట్టి మరొకసారి రిపీట్ చేస్తే బాగుంటుందని సమాచారం.మరి ఈ సినిమాలో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకుంటుంది లేదో వేచి చూడాల్సిందే.