పవన్ కళ్యాణ్ స్థానాన్ని ఆక్రమించిన మరో యంగ్ హీరో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో తప్ప వేరే భాష లో నటించని హీరో అయినప్పటికీ ఆయనకు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. పవన్ కళ్యాణ్ తన నటన తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందాడు. సినీ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మెగాస్టార్ చిరంజీవికి కూడా లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనే చెప్పాలి.. ఎందుకంటే ఈయన సినిమా ఎలా ఉన్నా సరే ఈ యూత్ వల్లే ఆయన సినిమా సక్సెస్ అవుతుంది..

ఇంతటి స్టార్ పొజిషన్ ను అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ ప్లేస్ ను మరొక యువ హీరో లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.. ఆయన ఎవరో కాదు రౌడీ హీరోగా వచ్చిన విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కూడా అంతే స్థాయిలో మంచి యూత్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈయన..అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఇక అందుకే ఈయన కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ స్థానాన్ని కాజేస్తాడు అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దిల్ రాజు చెప్పినట్లు నిజంగానే పవన్ కళ్యాణ్ స్థానాన్ని విజయ్ దేవరకొండ లాక్కుంటాడా..తెలియాలంటే మనం ఎదురు చూడాలి.