భారీ భవంతిని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. కాస్ట్ ఎంతంటే ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో కొత్తగా ఓ బంగ్లా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ భవనం కొనుగోలుకు రూ. 12 కోట్ల మొత్తాన్ని వెచ్చించి
నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లో నివాసం ఉంటున్నారు. అలాగే ఆయనకు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. తాజాగా పవన్ జూబ్లీహిల్స్ ఒక బంగ్లాను రూ 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

676 గజాల విస్తీర్ణం ఉన్న ఒక బంగ్లాను ఆయన కొనుగోలు చేసినట్లు జాప్కే. కామ్ వెల్లడించింది. పవన్ ఇంటి కొనుగోలుకు సంబంధించి గత నెల 23వ తేదీ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆయన రూ. 66 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 18 లక్షల ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రూ.6 లక్షల రిజిస్ట్రేషన్ రుసుం, మ్యూటేషన్ చార్జీగా రూ.1.20 లక్షలు వచ్చినట్లు డాక్యుమెంట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భవనం 6350 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కొత్త బంగ్లా కొనుగోలు చేసినట్లు ఆయన సన్నిహితుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.