క్యాబ్ డ్రైవర్ ని నానాతిట్లు తిట్టిన నటి సంజన.. ఎందుకంటే?

నటి సంజన శాండిల్వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి మళ్లీ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా నటి సంజన ఓలా క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడింది. షూటింగ్ స్పాట్ కు వెళ్ళడానికి బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరి నగర్ కు ఆమె క్యాబ్ బుక్ చేశారు. అయితే క్యాబ్ లోకి వచ్చిన తర్వాత ఆ గమ్యం మార్చాలని డ్రైవర్స్ సుసయ్ మణి కి సూచించిందట.

అప్పుడు అతడు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి అడిగాడట, అయితే లొకేషన్ మార్చలేదు.దీంతో కోపంతో ఊగిపోయిన సంజన ఆ క్యాబ్ డ్రైవర్ ని నానా తిట్లు తిడుతూ, అతనితో గొడవ పెట్టుకుందని, డ్రైవర్ ఆరోపించాడు. ఈ గొడవను వీడియో తీసి ఆమెపై రాజరాజేశ్వరి నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను చెప్పిన చోటికి తీసుకు వెళ్లలేదని సంజనా ట్విట్టర్ లో ఆరోపించారు.

క్యాబ్ లో ఏసీ ని పెంచాలని అడిగితే నిర్లక్ష్యంగా బదులు ఇచ్చాడని కార్ డోర్ కూడా సరిగా లేదని చెప్పారు. అంతేకాకుండా అడిగినంత డబ్బులు ఇచ్చి కూడా ఇటువంటి డబ్బా కారు లు వెళ్ళాలా అని వాళ్ళ పై మండిపడ్డారు. కారులో ఉండగానే ఆమె 100 కు ఫోన్ చేసి డ్రైవర్ పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Share post:

Popular