బిగ్‌బాస్‌-5: ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వారేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో నాలుగు వారాలు పూర్తి కాగా.. ఇంటి స‌భ్యులు ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చారు. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే న‌ట్‌రాజ్ మాస్ట‌ర్ నాలుగో వారం దుకాణం స‌ద్దేశారు. ఈయన బయటికి రావడానికి కారణం కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌డ‌మే ఆయ‌న కొంప ముంచింది.

BiggBossTelugu5 Housemates plays Dakko Dakko Meka game: బిగ్‌బాస్ హౌజ్‌లో  దాక్కో దాక్కో మేక ఆట ఆడించిన నాగ్‌| వినోదం News in Telugu

ఇదిలా ఉంటే.. ఈ రోజు సోమ‌వారం. అంటే బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. నామినేషన్ పేరుతో ఇంటి సభ్యులు వింత వింతగా ప్రవర్తిస్తూ ఒకరి తప్పుల్ని ఒకరు ఎత్తుచూపుకుని మాటలు తూటాలు పేల్చుకుంటారు. మ‌రోవైపు ఈ వారం ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా అని ప్రేక్ష‌కులు ఈగ‌ర్ వెయిట్ చేస్తుంటారు.

Bigg Boss 5 Telugu 4th week nominated contestants - Bigg Boss 5 Telugu

అయితే లీకుల వీరుల స‌మాచారం ప్ర‌కారం.. ఐదో వారం కాజల్, లోబో, సిరి, అనీ మాస్టర్‌, హ‌మీద‌, ప్రియాంక సింగ్‌, జెస్సీ, స్వేత‌, విశ్వ మొత్తం తొమ్మ‌ది మంది నామినేట్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి వీరిలో ఐదో వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రో తెలియాలంటే.. వ‌చ్చే ఆదివారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.