నాగబాబు బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనున్న నిహారిక?

మెగా డాటర్ నిహారిక రేపు మెగా అభిమానులకు తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పబోతోంది. నాగ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ రానుందని తాజాగా జి5 సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది.

ఈ సందర్భంగా జీ 5 ట్వీట్ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. అదేవిధంగా ఓసీఎఫ్ఎస్ అంటే ఎంటో గెస్ చేయగలరా అంటూ అడిగింది.ఇక జి 5 చేసిన ప్రకటనకు నిహారిక కూడా రీట్వీట్ చేస్తూ తాను కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నానని తెలిపింది.

నాన్న పుట్టినరోజు సందర్భంగా ఓపీఎఫ్ఎస్ అంటే ఏమిటో రేపు వెల్లడిస్తాను అంటూ ఆమె తెలిపింది. ఇక ఇటీవలే నిహారిక జొన్నలగడ్డ నాగచైతన్యతో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన విషయం అందరికి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంది. పెళ్లి తర్వాత నిహారిక తొలిసారిగా బుల్లితెరపై సందడి చేయబోతోంది.

Share post:

Latest