శారీరకంగా అది చాలా క‌ష్టం..నిధి అగర్వాల్ కామెంట్స్ వైర‌ల్‌!

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల నిధి అగ‌ర్వాల్‌.. ప్ర‌స్తుతం క్రిష్‌ జాగర్లమూడి తెర‌కెక్కిస్తున్న `హరి హర వీరమల్లు` లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా న‌టిస్తోంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నిధి `పంచమి` అనే యువరాణి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

Pic Talk - Beauty Nidhi Agerwal Traditional looks! - Star Zone

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిధి.. హరి హర వీరమల్లులో త‌న పాత్ర గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. `వీరమల్లు..లో నేను పంచమి అనే యువరాణిగా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే ఎంతో వైవిధ్యభరితమైన పాత్ర ఇది. మ‌రియు శారీరకంగా నాకెంతో క‌ష్టంగా అనిపించింది. ఎందుకంటే, నా రోల్ కోసం ఒంటిపై చాలా బరువైన ఆభరణాలు ధరించాలి.

Hari Hara Veera Mallu: Nidhhi Agerwal's first regal look as Panchami is a perfect birthday gift to fans | PINKVILLA

వాటిని క్యారీ చేస్తూ.. షూట్‌లో పాల్గొనడం ఎంతో ఇబ్బందిగా అనిపించేది. ఓ షాట్‌ అయిపోతే జాగ్రత్తగా ఓ దగ్గర కూర్చోవడమే తప్ప.. విశ్రాంతి తీసుకోవడానికి కూడా వీలుండేది కాదు. అయితే పంచ‌మి పాత్ర కోసం ప‌డిన కష్టమంతా నాకెంతో విలువైనదిగా అనిపించేది.` అంటూ చెప్పుకొచ్చింది. దాంతో నిధి కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest