మ‌హేష్ `స‌ర్కారు..`పై న‌యా అప్డేట్‌..ప్యాక‌ప్‌కి టైమ్ వ‌చ్చేసింది!

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13వ విడుద‌ల కానుంది.Mahesh Babu and Keerthy Suresh look perfect in new Sarkaru Vaari Paata still. Seen yet? - Movies News

అయితే ఈ మూవీ షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పే టైమ్ వ‌చ్చేసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం..స‌ర్కారు వారి టీమ్ ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంద‌ట‌. నవంబర్ మొదటివారం దీపావళి పండుగ తర్వాత ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించి, ఆ నెల చివరి వరకు షూటింగ్ జరపనున్నారట.Sarkaru Vaari Paata: Birthday boy Mahesh Babu surprises fans by dropping the teaser of Keerthy Suresh starrer

ఈ షెడ్యూల్‌తో `స‌ర్కారు వారి’ పాట చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక షూటింగ్ ఫినిష్ అయిందంటే.. ఆ వెంట‌నే ప్ర‌మోష‌న్స్ కూడా షురూ చేయ‌నున్నారు. కాగా, ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీతో మ‌హేష్ ఓ బ్యాంకు మేనేజర్ గా క‌నిపించ‌బోతున్నాడు.

Share post:

Latest