ర‌వితేజ 70వ చిత్రంపై బిగ్ అప్డేట్‌..!

`క్రాక్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా ర‌వితేజ.. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌ను ఓకే చెస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే రమేష్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 67వ చిత్రాన్ని పూర్తి చేసిన ర‌వితేజ‌..68వ సినిమాను శరత్‌ మండవ దర్శకత్వంలో చేస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో ర‌వితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు.

Ravi Teja's RT 70 biggest announcement tomorrow! - English

అలాగే మ‌రోవైపు ర‌వితేజ‌ త‌న‌ 69వ చిత్రాన్ని `ధ‌మ‌కా`గా ప్ర‌క‌టించాడు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించినున్న ఈ మూవీ ఇప్ప‌టికే సెట్స్ మీద‌కు వెళ్లిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ రెండు చిత్రాలు ఇంకా పూర్తి కాకుండానే.. ర‌వితేజ త‌న 70వ సినిమాను సైతం లైన్‌లో పెట్టి తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చేశాడు.

Ravi Teja's RT 70 biggest announcement tomorrow! - English

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను రేపు (అక్టోబర్ 31 ఆదివారం) ఉదయం 10 గంటల 8 ని.లకు రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి రవితేజ ఈ కొత్త మూవీని ఎవరితో ప్లాన్ చేశారో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

Share post:

Latest