`భోళా శంకర్`పై బిగ్ అప్డేట్‌..ఆ రూమ‌ర్ల‌కు చిరు చెక్!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మే `భోళా శంక‌ర్‌`. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్‌గా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది.

Chiranjeevi-Meher Ramesh film titled Bhola Shankar- Cinema express

అయితే ఈ చిత్రం ఇప్ప‌ట్లో ప్రారంభం అవ్వ‌ద‌ని..మొద‌ట బాబి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేశాకే భోళ శంక‌ర్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. కానీ, తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలను 11-11-2021 తేదీన ఉదయం గం.7:45నిలకు నిర్వహించబోతున్నట్టు, రెగ్యులర్ షూటింగ్‌ను 15-11-2021 తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Keerthy Suresh To Play Chiranjeevi's Sister In Telugu Movie 'Bhola Shankar' - Sacnilk

ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియా ద్వారా వదిలారు. దాంతో ఈ సినిమాపై జ‌రుగుతున్న రూమ‌ర్ల‌కు చిరు చెక్ పెట్ట‌న‌ట్టు అయింది. కాగా, మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా త‌మ‌న్నా న‌టించ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest