నెట్, యాప్ తో అవసరం లేకుండానే డబ్బు బదిలీ..!!

ఇప్పుడు నగదు బదిలీ కోసం ఇంటర్నెట్ లేకుండా సరే ఉచితంగా.. నిస్సందేహంగా డబ్బులు బదిలీ చేయవచ్చు అంటున్నారు నిపుణులు.. అంతే కాదు మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా సరే డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చట.. అయితే ఇందుకోసం మీరు *99# అనే కోడ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది అని సూచిస్తున్నారు నిపుణులు. ఇది ఇంటర్నెట్ లేకుండా డబ్బు ఎలా బదిలీ చేయాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ముందుగా మీ ఫోన్ లో డైల్ పాడ్ ఓపెన్ చేసి *99# అని నంబర్ ను టైప్ చేయగానే, 7 సరికొత్త ఎంపికల తో కూడిన ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.. ఇందులో మీరు డబ్బు పంపించడం లేదా డబ్బు స్వీకరించడం, చెక్ బ్యాలెన్స్ ,మై ప్రొఫైల్, పెండింగ్ అభ్యర్థనలు.. లావాదేవీలు.. యూపీఐ పిన్ వంటి ఆప్షన్లు మీకు కనిపిస్తాయి.

ఇక ఇప్పుడు డైల్ పాడ్ నెంబర్ పై ఒకటి నొక్కితే డబ్బులు పంపండి అనే ఎంపిక ఎంచుకోవచ్చు.. ఆ తర్వాత మీ ఖాతా నెంబర్ , ఐఎఫ్ఎస్సి కోడ్ ఉపయోగించి డబ్బు పంపించడానికి మిమ్మల్ని అనుమతి కోరుతుంది.. ఇక అలా ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి మీరు ఎంత డబ్బు పంపించాలి అనుకుంటున్నారో..అలా వివరాలన్నీ ఇచ్చి అని సెండ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు డబ్బు పంపాలనుకున్న వారికి చేరుతుంది.